బుధవారం శివరాత్రి పండగ నాడే నగరంలో హడలెత్తించిన వరస దొంగతనాల కేసుల ను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. రెండు గంటల వ్యవధి లో మూడిళ్ళ లను లూటీ చేసిన నిందితుడిని హైదారాబాద్ లో అదుపులో తీసుకున్నారు.
అతని మీద హైదారాబాద్ లో 80 పైగా కేసులున్నాయి గతంలో పిడి యాక్టు లోనూ జైలు కు వెళ్లి వచ్చినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడయింది. హైదారాబాద్ నుంచి స్కూటీ మీద వచ్చిన ఘరానా దొంగ జస్ట్ రెండు గంటల వ్యవధిలో నగర శివారు లో మూడు ఇండ్లనుదోచేశారు.
ఏక శీలా నగర్ లో పెద్దమ్మ గుడి సమీపం లో ఉండే కిరాణా వ్యాపారి రవీందర్ ఇంటికి ఉదయం 10:30 తాళం వేసిగుడి కి వెళ్లి కొద్దీ నిమిషాల్లో వచ్చి చుస్తే తాళం పగల గొట్టి రూ 60 వేల నగదు ఎత్తుకెళ్లారు ఇంట్లో నగలున్న అవి చోరీ కాలేదు.
అలాగే గంగాస్టాన్ లో రియల్టర్ బలరాం రెడ్డి ఈ మద్యే కేశాపుర్ వెళ్లే దారి లో ఇళ్లు కట్టుకున్నాడు మధ్యాహ్నమే 12:30 కి తాళం వేసి కాంటేశ్వర్ గుడికి వచ్చి దర్శనం చేసుకొని 1:15 కు వెళ్లే సరికి తాళం పగల గొట్టి ఉంది ఇంట్లో వెళ్లి చుస్తే బీరువా లో చిన్న కూతురు కు చెందిన సుమారు 25 తులాల నగలు మాయం అయ్యాయి.
అలాగే ఆర్టీసీ కాలొనీ లో రవీందర్ సైతం గుడికి వెళ్లి వచ్చే లోపు ఇంటి తాళంపగల గొట్టేసి రెండు తులాల నగలు ఎత్తుకెళ్లారు. మూడు చోరీ లు ఓకే తరహాలో జస్ట్ రెండు గంటల లోపే జరిగాయి. అదికూడా పట్టపగలే కావడంతో పోలీసులు సవాల్ గా తీసుకోని దర్యాప్తు చేపట్టారు.
