ట్రాక్టర్ పై నుంచి పడి యువకుడు మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలం జాన్కంపేట శివారులో చోటుచేసుకొంది.
డస్ట్ పౌడర్తో వెళుతున్న ట్రాక్టర్ పై వెళుతున్న మిట్టపల్లికి చెందిన ఓ యువకుడు ఫిట్స్ రావడంతో ట్రాక్టర్ పై నుంచి కింద పడిపోయాడు, దీంతో అదే ట్రాక్టర్ ఆ యువకునిపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబందించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
