మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి శనివారం ఉదయం నీటిని విడుదల చేసారు . త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో సిడబ్ల్యూసి ఈఈ వెంకటేశ్వర్లు, డి ఈ నాందేడ్ ప్రశాంత్, బాబ్లీ ప్రాజెక్టు అసిస్టెంట్ ఇంజనీర్లు వినయ్, రికీ, సుశాంత్, ఎస్సారెస్పీ ఏఈ రవి లు కలిసి బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు.
దిగువ గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. 0.6 టీఎంసీల నీటి విడుదల పూర్తికాగానే గేట్లను మూసి వేయనున్నట్లు తెలిపారు. . ఎస్సారెస్పీ లోకి రాత్రి వరకు ఈ నీటి ప్రవాహం చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 80.515 టీఎంసీలు కాగా శనివారం ఎస్సారెస్పీ రిజర్వాయర్ లో నీటి మట్టం 1075.00 అడుగులు 32.897 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు.
