ఆర్మూర్ డివిజన్ లోని 10 పోలీసు స్టేషన్ల పరిధులలో ఈ నెల 12 న డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు లు జరిపి మద్యం త్రాగి వాహనాలు నడిపిన మొత్తం 256 ముద్దాయిలను స్పెషల్ డ్రైవ్ క్రింద గౌరవ ఆర్మూర్ కోర్ట్ నందు హాజరు పరచగా, వారిలో *19 మంది ముద్దాయిలకు (02) రోజుల జైలు శిక్ష విధించరాని ఆర్మూర్ ఏసీపీ బస్వా రెడ్డి చెప్పారు
237 ముద్దాయిలకు జరిమానా క్రింద మొత్తం రూ. 4,43,000/- (అక్షరాల నాలుగు లక్షల నలబై మూడు వేల రూపాయలు) జరిమానా విధించనైనది.*
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ నుండి 38 కేసులకు గాను నలుగురికి జైలు శిక్ష మరియు 67,500/- రూపాయలు జరిమానా, బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిదిలో 21 కేసులకు 41,500/- రూపాయలు జరిమానా, నందిపేట్ పోలీస్ స్టేషన్ నుండి 21 కేసులకు గాను 30,500/- రూపాయలు జరిమానా, వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిడిలో 18 కేసులకు గాను 38,000/- రూపాయలు జరిమానా, మెండోరా పోలీస్ స్టేషన్ నుండి 29 కేసులకు గాను అయిదుగురికి జైలు శిక్ష మరియు 68,000/- రూపాయలు జరిమానా, ముప్కాల్ పోలీస్ స్టేషన్ నుండి 12 కేసులకు గాను ఒక్కరికీ జైలు శిక్ష మరియు 23500/- రూపాయలు జరిమానా, భీంగల్ పోలీస్ స్టేషన్ నుండి 29 కేసులకు గాను ముగ్గురికి జైలు శిక్ష మరియు 44,000/- రూపాయలు జరిమానా, కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ నుండి 32 కేసులకు గాను నలుగురికి జైలు శిక్ష మరియు 45,500/- రూపాయలు జరిమానా, ఎర్గట్ల పోలీస్ స్టేషన్ నుండి 31 కేసులకు గాను ఇద్దరికీ జైలు శిక్ష మరియు 55,000/- రూపాయలు జరిమానా మరియు మోర్తాడ్ పోలీస్ స్టేషన్ నుండి 25 కేసులకు గాను 29,500/- రూపాయలు జరిమానా విదించడం జరిగినది. ఇకముందు మద్యం త్రాగి వాహనాలు నడిపిన వారిపైన చట్టరీత్యా కఠినమైన చర్యలు ఉంటాయన్నారు
