ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు
@@@@@
బాన్సువాడ వర్ని రహదారిలో బుధవారం ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 40 లక్షల రూపాయల విలువచేసే నిషేధిత ఆల్ఫా జోలం ను స్వాధీనపరుచుకున్నారు. స్టేట్ ఎక్సైజ్ ట్రాన్స్పోర్ట్ బృందం తనిఖీలు చేపట్టారు బాన్సువాడ వర్ని రహదారిలో వాహన తనిఖీలలో నాలుగున్నర కిలోల ఆల్ఫాజూలంను స్వాధీనపరుచుకున్నారు దీని విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందని టాస్క్ఫోర్స్ బృందం అధికారులు తెలిపారు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని టాస్క్ఫోర్స్ బృందం అధికారులు విచారణ చేపడుతున్నారు టాస్క్ ఫోర్స్ బృందం అధికారులు స్వాధీన పరుచుకున్న ఆల్ఫాజూలంను బోధన్ ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు ఈ దాడులలో స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందం సూపర్డెంట్ ప్రదీప్ రావు డి.ఎస్.పి శ్రీనివాసరావు సిఐ వెంకటేష్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ స్వప్న పాల్గొన్నారు.
