HomeCRIME44 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత..

44 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత..

అక్రమంగా రవాణా చేస్తున్న 44 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని నగరంలోని 6వ టౌన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు.

ఆరవ టౌన్ ఎస్ఐ వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం. నగరంలోని అర్సపల్లి -నిజాం కాలనీ ల మధ్య ఓ టాటా బొలెరో ట్రాలీ ఆటో డ్రైవర్ అజయ్ గోదేకర్ 75 సంచుల, సుమారు 44 క్విటల్ పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకున్నట్లు పేర్కొన్నారు.

అజయ్ ను పట్టుకొని విచారించగా నవీపేట్ కు చెందిన హాజీ తో కలిసి పిడిఎస్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలించి అధిక డబ్బులకు విక్రయిస్తామని ఒప్పుకున్నారు.

అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నందున అజయ్ గోదేకర్, హాజీలను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్రావు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments