HomeTelanganaNizamabadసంక్రాంతికి 444 ప్రత్యేక బస్సులు

సంక్రాంతికి 444 ప్రత్యేక బస్సులు

పల్లె ప్రజలు ఆనందోత్సవాలతో 3 రోజుల పాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి. సొంతూళ్లకు వెళ్లే వారి కోసం టీజీఎస్ఆర్టీసీ, నిజామాబాద్ రీజియన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నిజామాబాద్ నుంచి 444 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. దూర ప్రాంతాలకు మరియు ప్రత్యేకంగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళే ప్రయాణీకుల సౌకర్యార్థం ఆర్మూర్, బోధన్, నిజామాబాద్-1, నిజామాబాద్-2, బాన్సువాడ మరియు కామారెడ్డి నుండి హైదరబాద్ వరకు మరియ విజయవాడ వరకు స్పెషల్ బస్సులను నడుపుతోందనీ తెలిపారు.

ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగినన్ని బస్సులను ఏర్పాటు చేయబడినవి. జనవరి 9 నుంచి 12 వరకు మరియు జనవరి 16 నుంచి 20 వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు, తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments