తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ బీజేపీ చార్జిషీట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ గ్యారంటీల గారడీ 6 అబద్ధాలు.. 66 మోసాలు’ పేరుతో జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి,ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి లు ఈ చార్జిషీట్ ను విడుదల చేశారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని నిజామాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు దినేష్ కులచారీ విమర్శించారు.
బుదవారం నగరంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…నిజామాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ పిసిసి, ఎమ్మెల్యే లు ఉన్న కూడా జిల్లా అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని విమర్శించారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న మంత్రి వర్గంలో కనీసం జిల్లాకు ఒక్కరికి కూడా చోటు కల్పించక పోవడం గమనార్హం అని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసంచేసిందని ద్వజమెత్తారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇందూరు జిల్లాకు ఎన్ఎస్ఎఫ్,బోధన్ షుగర్ ఫ్యాక్టరీలను 6 నెలలో తెరిపిస్తామని హామీచేసి రైతాంగముండే హిందూ జిల్లాను నిండా ముంచిందని దుయ్యబట్టారు. బోధన్ లోని షుగర్ ఫ్యాక్టరీనీ తెరిపిస్తామని చెప్పి కమిటీల పేర్లతో కాలయాపన చేస్తున్నారని ఆయన విమర్శించాడు.
నిజామాబాద్,ఆదిలాబాద్, కరీంనగర్ లలో అత్యధికంగా గల్ఫ్ కు వెళ్లే ప్రజలు అత్యధికంగా ఉంటారని గుర్తించి గతంలో కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ లోని జక్రాన్ పల్లి లో ఎయిర్పోర్ట్ ను మంజూరు చేసిందని గుర్తు చేశావు.గత ప్రభుత్యం భూసేకరణ చేసి 50 శాతం పనులు కూడా ప్రారంభించారని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ఆ ఎయిర్ పోర్ట్ ని రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.
6 గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని స్వయంగా సోనియా గాంధీ కరపత్రాల రూపంలో ఇంటింటికి చేర్చారు. కానీ ఈ ఏడాది కాలంలో మీరిచ్చిన హామీలు ఏవీ కూడా అమలు కాలేదు. డిసెంబర్ 7న అధికారంలోకి వస్తాను, డిసెంబర్ 9వ తేదీన రైతుల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గతేడాది ఎన్నికలకు ముందు ఊరూరా ప్రజలను నమ్మించారు.
కానీ ఈ ఏడాది కాలంలో హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ విజయోత్సవాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని, విజయోత్సవాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.
ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసలు, అరెస్టులు, లాఠీచార్జీలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడాలేదన్నారు. మంచిప్ప రిజర్వాయర్ కింద ఉన్న భూముల విషయంలో ఏ ఒక్కరికి నష్టం జరగదని ప్రస్తుత రూరల్ ఎమ్మెల్యే హామీచేసి రైతులకు మోసం చేశారని ఆయన విమర్శించారు.అదేవిధంగా జిల్లా అభివృద్ధి పై కాంగ్రెస్ పిసిసి, ఎమ్మెల్యేలు చర్చకు రావాలని సవాల్ చేశారు.
మారింది పాలకులే పాలన కాదు: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి..దోపిడీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందు దొందేనని రాకేష్ రెడ్డి విమర్శించారు. మారింది పాలకులే కానీ పాలన, ప్రజల బతుకులు మారలేదని దుయ్యబట్టింది. గవర్నర్ ముందు ప్రమాణస్వీకారం చేసిన రాష్ట్ర మంత్రి ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థినీ జిల్లా కలెక్టర్ కు పరిచయం చేయడం సిగ్గుచేటని ద్వజమెత్తారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని , అలాగే వీధి వీధి నా కాంగ్రెస్ కార్యకర్తలతో బెల్ట్ షాపులు తెరిపిస్తున్నారని పేర్కొన్నారు.డ్రగ్స్ సరఫరా అవుతుందనీ రాష్ట్రాన్ని పంజాబ్ రాష్ట్రంగా చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
