వివాహితపై అత్త, మరిదీలు కలిసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన రెంజల్ మండలంలో చోటుచేసుకుంది.ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వివాహిత ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది.
వివరాల్లోకి వెళ్లితే..మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన సాఫీయ, షాహిద్ ఖాన్ అనే వ్యక్తితో వివాహమైంది. షాహిద్ ఖాన్ కు ఇది నాలుగవ వివాహం అని చెప్పకుండా సాఫీయ కు వివాహం చేశారు. తరువాత కొన్ని రోజులకు సాఫీయకు ఈ విషయం తెలియడంతో పుట్టింటికి వెళ్లిపోయింది.
ఇటీవల బోధన్ లో ఓ దొంగతనం కేసులో షాహిద్ ఖాన్ పై కేసు నమోదైంది.అందుకు అతన్ని అరెస్టు చేయగా అనారోగ్యంతో బాధపడుతున్నారని నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆ విషయం తెలియడంతో సాఫీయ సాటాపూర్ లోని తన భర్త ఇంటికి వెళ్లి బట్టలు తీసుకొనే క్రమంలో భర్త షాహిద్ ఖాన్ వాళ్ళ అమ్మ, తమ్ములు కలిసి మూకుమ్మడిగా ఆ వివాహిత పై కత్తి,కర్రలతో దాడి చేశారు.
దీంతో వివాహిత కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న వివాహిత కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
వివాహిత కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లిన పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
