విద్యుత్ ఘాతం తో ఇళ్లు దగ్ధమైంది. ఈ ఘటన ఆరో టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే శుక్రవారం అర్ధరాత్రి.
వెంగల్ రావు నగర్ కాలనీకి చెందిన ముస్తాద్ బేగం ఇంట్లో విద్యుత్ ఘాతం తో ఒక్క సరిగా మంటలు చెలరేగాయి. దీంతో కుటుంబీకులు బయటకు వెళ్ళేసరికి ఇల్లు దగ్ధమైంది.
అగ్ని మాపక శాఖకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులో తీసుకొచ్చారు. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగిందని కుటుంబీకులు తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
