ఈ ఘటన నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. లోకో పైలట్ గా విధులు నిర్వహిస్తున్న తిరుమల్ అనే నగరంలోని మారుతి నగర్ లోనీ ఓ ఇంట్లో కొన్ని రోజులుగా కిరాయికి ఉంటున్నారు.
ఈ మేరకు ఇంటికి తాళం వేసి తిరుమల్ విధులు నిమిత్తం వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగల గొట్టి ఇంట్లొకి చొరబడి తులం బంగారం, 50 తులాల వెండి, రూ. 50 వేల నగదు అపహరించినట్లు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
