నిజామాబాద్ ఆటోమొబైల్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన ప్రకాష్ హ్యుండయ్ కార్ షోరూమ్ నందు శనివారం నాడు నూతన క్రెటా ఎలక్ట్రిక్ కారును జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్శ్రీ ఎల్ రాజా వెంకటరెడ్డి గారు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో షోరూంఎండి నల్ల స్రవంతి రెడ్డి గారు మాట్లాడుతూ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారులో అత్యధిక సాంకేతికత పరిజ్ఞానంతో కూడిన సరికొత్త 42 కేడబ్ల్యూహెచ్ మరియు 51.4 కెడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల అల్టిమేట్ బ్యాటరీతో భద్రత సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఒకసారి చార్జింగ్ పెడితే 473 కిలోమీటర్లు మైలేజ్ వస్తుందని బ్యాటరీ 10% నుంచి 80% వరకు కేవలం 58 నిమిషాల్లో (50 కే డ బ్లూ),39 నిమిషాల్లో (100 కే డబ్ల్యూ) డీసీ చార్జింగ్ అవుతుందన్నారు.కేవలం 7.9 సెకండ్లలో సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగానికి చేరుకుంటుందని తెలిపారు.
వీ2ఎల్( వెహికల్ టు లోడ్ )ఫీచర్ బ్యాటరీతో పాటు సెల్ ఫోన్ , ల్యాప్టాప్ లను ఛార్జ్ చేసుకోవచ్చు అని .17 ఇంచ్ అలా వీల్స్, లెవెల్ 2 అడాస్, అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టం, 70 ప్లస్ స్టాండర్డ్ సేఫ్టీ ఫ్యూచర్స్, కోల్డ్ స్టోరేజ్ , సన్ రూఫ్, డ్యూయల్ టోన్ రంగులతో కారు ప్రారంభ ధర 17.99 లక్షల నుండి 23.50 లక్షల ధరతో లభిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ వినోద్ , నితిన్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు
