HomeCRIMEగచ్చిబౌలి లో పోలీసుల మీద పబ్ లో కాల్పులు ........జల్సా చేస్తున్న నిందితుడి ని పట్టుకునే...

గచ్చిబౌలి లో పోలీసుల మీద పబ్ లో కాల్పులు ……..జల్సా చేస్తున్న నిందితుడి ని పట్టుకునే క్రమంలో ఘటన

హైదరాబాద్ లో మరోసారి కాల్పుల మోత మోగింది .ఈసారి ఏకంగా పోలీసులమీదే కాల్పులు జరిగాయి.సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లో గచ్చిబౌలిలో కాల్పుల కలకలం రేగింది. పోలీసులపై దొంగ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.

ఈ ఘటన లో కానిస్టేబుల్ తో పాటు ఓ బౌన్సర్‌కు గాయాలయ్యాయి. గాయపడ్డవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యం అందిస్తున్నారు. ఓ పబ్‌లో దొంగను పట్టుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది.

కాల్పులు జరిపినా పోలీసులు సాహసం చేసి దొంగను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ఘటనపై ఆరా తీశారు. కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అయితే ‘దొంగ ఎవరు..?, అతనిపై ఎన్ని కేసులు ఉన్నాయి. ఎంత కాలం నుంచి పరారీలో ఉన్నారు. అసలు దొంగ ఎందుకు కాల్పులు జరిపారనది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఘటనతో పబ్ లోపలా, బయటా టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఒక్కసారిగా కాల్పుల శబ్ధంతో స్థానికులు సైతం భయాందోళనకు గురయ్యారు. దొంగ కాల్పులు జరుగుతున్న టైమ్ ల్ . పోలీసులు, దొంగలను చూసి పబ్ కు వచ్చిన వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments