కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగింపు కోసం మలక్ పేట్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం నుంచి స్పెషల్ డ్రైవ్ లు చేపట్టారు సౌత్ ఈస్ట్ ట్రాఫిక్ డిసిపి వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు డ్రైవ్ చేపట్టారు బ్లాక్ ఫిల్మ్ ఉన్న.
వాహనదారులకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలు ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు మాత్రమే కాకుండా నేర కార్యకలాపాలకు కూడా దోహదపడతాయనే ఆందోళనలు ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే మోటారు వాహనాల చట్టం 1988లోని సీఎంవీ రూల్ 100, సెక్షన్లు 177, 179(1) కింద.. బ్లాక్ ఫిల్మ్ అద్దాలతో తిరిగే వాహనాలకు జరిమానాలు విధిస్తున్నారు. ఇన్సెపెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూవాహనాలకు బ్లాక్ ఫిలిమ్లు వేసుకొని తిరగడంపై నిషేధం ఉందన్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాలు, సెంట్రల్ మోటర్ వెహికల్ రూల్ 100 ప్రకారం.. వాహనాల ముందు విండోకు 70 శాతం వెలుతురు వచ్చే విధంగా, వెనుక విండోకు 50 శాతానికి తక్కువ కాకుండా వెలుతురు వచ్చే విధంగా తయారు చేయాలని నిబంధనలు ఉన్నాయని చెప్పారు.
నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బ్లాక్ ఫిలిమ్‌ను తొలగించడంతో పాటు కేసులు నమోదు చేసి, రూ. 1000 జరిమానా విధిస్తున్నట్లు ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.
