ఏర్గట్ల మండలం నాగేంద్రనగర్ గ్రామంలో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. పలు ఇళ్లల్లో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డట్లు స్థానికులు తెలిపారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో ఇల్లు తాళాలు పగలగొట్టి బీరువాని ధ్వంసం చేసి అందులోని నగదు, బంగారాన్ని అపహరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
