తుపాన్ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మల్కాపూర్ గండిలో నిజామాబాద్ నుంచి బాన్సువాడ వైపు వెళ్తుంది.అలాగే బాన్సువాడ నుంచి నిజామాబాద్ వైపుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారం మేరకు రూరల్ ఎస్ఐ ఆరీఫ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.అందులో ఒకరి పరిస్థితి విషమం ఉందని తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
