HomeHEALTHనందిపేటలో చికెన్ మేళకు ఏగబడ్డ జనం…

నందిపేటలో చికెన్ మేళకు ఏగబడ్డ జనం…

పౌల్ట్రీ బ్రీడెర్స్ కో ఆర్డినేషన్ అసోసియేషన్, నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ, వెంకటేశ్వర హాఛారి కంపెనీ, నందిపేట్ చికెన్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో నందిపేట మండల కేంద్ర బంగారు కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన ఫ్రీ చికెన్ మేళ లో 200 కేజీలతో చికెన్ మంచూరియా, చికెన్ పకోడీ, 2000 ల గుడ్లను ఉచిత పంపిణీ చేశారు. ఈ చికెన్ మేళ కు స్థానిక ప్రజలు ఎగబడడంతో అర్థగంటలోపే స్నాక్స్ అన్ని పూర్తయిపోయాయి.

ఈ సందర్భంగా వెంకాబ్ చికెన్ కంపెనీ సిబ్బంది మాట్లాడుతూ .. ప్రస్తుతం రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ప్రభావం తీవ్రంగా ఉందని ప్రజలు అపోహ పడుతున్న సందర్భంగా చికెన్ తినడం వల్ల ఎటువంటి వైరస్లు సోకవని, డబ్ల్యూహెచ్వో నిబంధన ప్రకారం చికెను 70% వేడిలో ఉడకబెట్టి తింటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని, ప్రజల అవగాహన కొరకు వెంకాబ్ ఆధ్వర్యంలో బంగారు కాంప్లెక్స్ వద్ద ఈ చికెన్ మేళ నిర్వహించడం జరిగిందని, చికెన్ ప్రియుల విశేష స్పందన తో అర్థగంటలోపే చికెన్ మొత్తం ఖాళీ అయిపోయిందని అన్నారు.

స్థానిక మహిళలు కూడా చికెన్ తినడం వల్ల ఎటువంటి వైరస్లు సోకవని, ఎవరు కూడా భయపడద్దని నిర్భయంగా చికెన్ తినొచ్చునని, ఎటువంటి రూమర్స్ నమ్మవద్దని స్థానిక మహిళలు చికెన్ తింటూ తెలిపారు.

అసిస్టెంట్ మేనేజర్ భగవాన్ రెడ్డి, వెంకాబ్ సిబ్బంది మల్లేష్, వరప్రసాద్, పౌల్ట్రీ యజమాని నందిపేట్ వినయ్, నందిపేట్ ట్రేడర్స్ శ్రీనివాస్, సాహెబ్ హుస్సేన్, చికెన్ సెంటర్ ల యజమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments