విదేశాల్లో ఉద్యోగం, రూ. లక్షల్లో సంపాదన పేరిట నిరుద్యోగ యువత ను నమ్మిస్తూ సైబర్ పావులుగా థాయిలాండ్,లావోస్ విదేశాలకు పంపే ఏజెంట్ లను సైబర్ క్రైమ్ పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే..అలకుంట సంపత్,దండుగుల చిరంజీవి,మిట్టపల్లి నర్సారెడ్డి ను ముగ్గురు ఏజెంట్ లు విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన వీరిని అదుపులోకి తీసుకున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి బాధితుల నుంచి ఒక్కొక్కరి వద్ద లక్ష చొప్పున వసూలు చేసి నిరుద్యోగ యువతను థాయ్‌లాండ్, లావోస్ దేశాలకు పంపే పనిలో పై ముగ్గురు ఏజెంట్లు ఉన్నారు.
నిరుద్యోగ యువత నిర్బందముగా లావోస్ దేశం లొ సైబర్ నేరాలు చేయవలసి వచ్చింది. చివరగా, భారతీయ రాయబార కార్యాలయం సహాయంతో, ఇద్దరు బాధితులు భారతదేశానికి తిరిగి వచ్చి ఏజెంట్లపై ఫిర్యాదు చేయగా ఏజెంట్ లను అరెస్ట్ చెసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించి నిజామాబాద్ జైలుకు తరలించినట్లు సైబర్ క్రైమ్ పోలిసులు తెలిపారు.
