- బాజిరెడ్డి గోవర్ధన్
- బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికిన మల్లాపూర్ మండల ప్రజలు
- కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమం
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసి తనను ఆశీర్వదించాలని నిజామాబాద్ బి ఆర్ ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయనకు కోరుట్ల ప్రజలు.. బాజిరెడ్డికి మంగళ హారతులతో ఘన స్వాగతం పలికినారు.
ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే జగిత్యాల ఎమ్మెల్యే డా .ఎం.సంజయ్ కుమార్ , కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వారితోపాటు జగిత్యాల జిల్లా బీఆర్ఏస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , జగిత్యాల్ జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత , మాజీ ఎమ్మెల్సీ విజి గంగాధర్ గౌడ్ నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





