నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లిలో మారుతి (32) అనుమానస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గ్యారేజ్ ఓనర్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి మృతుడు పని చేస్తున్న గ్యారేజి ఓనర్ నాగబాబు ఇంటికి నుంచి భోజనం తీసుకొని గ్యారేజ్ కు వెళ్ళాడు. కాగా మంగళవారం ఉదయం తోటి డ్రైవర్లు డ్యూటీకి వెళ్లడానికి మారుతి ఉంటున్న గ్యారేజ్ కి వెళ్లారు.
మారుతి ఎంత పిలిచిన లెవకపోవడంతో ఒంటిపై దుప్పటి తీసే సరికి ఆయన ఒంటిపై చీమలు పారుతుండడంతో అనుమానం వచ్చి తన యజమాని అయిన నాగబాబుకు సమాచారం అందించారు. గ్యారేజీకి చేరుకున్న నాగబాబు అనుమానం వచ్చి 100 డయల్ కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృత దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ హెచ్ ఓ పేర్కొన్నారు.