గిట్టుబాటు ధర కోసం కొద్దీ రోజులుగా ఆందోళన చేస్తున్న పసుపు రైతులు బుధవారం పసుపు బిట్ల ను చూడడానికి వచ్చిన మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ముప్ప గంగారెడ్డి కి రైతులు చుక్కలు చూపెట్టారు.
ధరలు దక్కక అల్లాడిపోతుంటే ఎక్కుడున్నావు అంటూ ఆయను గట్టిగా నిలదీశారు. సీజన్ ఆరంభంలోనే నష్టాలు పలుకరిస్తుండడంతో అన్నదాతలు ఆగమవుతున్నారు. నిజామాబాద్ మార్కెట్‌యార్డుకు ఇప్పుడిప్పుడే పసుపు ఉత్పత్తులు వస్తున్నాయి.
గంపెడాశతో మార్కెట్‌కు పంటను తీసుకొస్తున్న ధరలు చూసి రైతులు నివ్వెరపోతున్నారు. క్వింటాలు ధర గరిష్ఠంగా రూ.8 వేలలోపే పలుకుతుండడం కర్షకులను కలవరపాటుకు గురిచేస్తున్నది. గతేడాది రికార్డు స్థాయిలో ధర పలికిందని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్యం ఇప్పుడెందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
బుదవారం మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డినీ సందర్శించారు.దీంతో రైతులు మార్కెట్ కమిటీ చైర్మన్ ను చుట్టూముట్టి మద్దతు ధర ఎందుకు కల్పించడం లేదని నిలదీశారు. దీంతో సదరు మార్కెట్ కమిటీ చైర్మన్ చమటలు కక్కుతూ రైతులతో ప్రతి కల్లాం వద్ద తిరిగారు.
ఎన్నికల ముందు క్వింటాల్‌కు రూ.15 వేలు ఇస్తామని రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చడంలేదు ఎందుకని ప్రశ్నించారు. పసుపునకు మార్కెట్లో క్వింటాల్‌కు రూ.9 వేలు కూడా దక్కకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించేందుకు కనీస చర్యలు తీసుకోకుండా అన్నదాతను నయవంచనకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే క్వింటాల్ పసుపునకు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.ఎన్నికలప్పుడు ఓట్ల కోసం తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపునకు మద్దతు ధర కల్పిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ తీరా అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని ఎండగట్టారు.
మార్కెట్ యార్డులో క్యాష్ కటింగ్‌ను అరికట్టాలని, సిండికేట్‌గా ఏర్పడి పసుపు ధరలను తగ్గిస్తున్న దళారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్యం ఆదుకునేలా చూడాలి.._ రైతు సత్యం..వేల్పూరు..ఎన్నో ఆశలతో పసుపు పంటను పండించే మేము ఇప్పుడు నిరాశతో ఉన్నాం.
ఏటా పసుపు పంటతో లాభాలు వస్తాయని ఎన్నో ఆశలతో ఉంటాం కానీ సరైన ధరలు రాక ఇబ్బందుల పడుతున్నాం. ఇప్పటికైనా ధర సరిగా వచ్చేలా చూసి మాకు లాభం చేకూరేలా చూడాల్సిన అవసరం ఉంది.
ఈ సారి కనీసం ఖర్చులు కూడా రాని పరిస్థితి. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు.
