హైదరాబాద్ : శనివారం అసెంబ్లీ సమావేశాల్లో నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారు మాట్లాడుతు ఇందూర్ పట్టణంలో సుమారు వెయ్యి ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి శ్రీ రఘునాథ ఆలయం నేడు శిథిలావస్థలో ఉన్న విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైన వేములవాడ రాజన్న దేవాలయం, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి అనేక దేవాలయాల లాగే చారిత్రక వైభావానికి ఒక చిహ్నం గా, ఆధ్యాత్మిక చింతనకు అలవాలంగా ఉన్న ఈ ఖిల్లా రామాలయంలో రాముల వారినీ దర్శించుకోవడానికి ఉత్తర తెలంగాణ లోని భక్తులతోపాటు పక్కన ఉన్న మహారాష్ట్ర ప్రాంతం నుండి భక్తులు వేల సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని అన్నారుఒకనాడు ఎంతో అంగరంగ వైభవంగా దూప దీప నైవేద్యాలు,పూజలు,సీతారామస్వామి కళ్యాణ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగేవని అలాంటి దేవాలయం నేడు శితిల అవస్థలో ఉందని తెలీజేయడానికి ఎంతో బాధపడుతున్న అన్నారు.
ఇందూరు పట్టణంలో ఉన్న రఘునాథ ఆలయంలో చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందనిఆనాడు రాష్ట్రకూటుల వంశానికి చెందిన ఇంద్రుడు క్రీ. శ. 914 – 928 మధ్యకాలంలో ఇందూర్ ను పాలించినప్పుడు ఈ కోటను నిర్మించాడం జరిగిందని అన్నారు.
450 ఏళ్ల క్రితం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువైన శ్రీ సద్గురు సమర్థ రామదాసు మహారాజ్ గారు ఈ ఆలయ నిర్మాణం చేయడం జరిగిందని అన్నారు.
ఈ దేశంలో మొఘల్ లు వచ్చిన తరువాత ఏ రంకంగా అయితే వేల సంఖ్యలో హిందూ దేవాలయాలు కూల్చబడాయో అదేవిధంగా 1862 సంవత్సరంలో నిజాం నవాబు అక్కడ ఉన్న కోటను కేంద్ర కర్మాగారంగా మార్చి అక్కడి దేవాలయంలో పూజలను నిషేధించి ఖైదీలతో పాటు ఆ రాములోరిని కూడా బంధీ చేసిండని ఇది ఎంతటి దుర్మార్గమైన చర్యనో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ విమోచనం కోసం చేసిన పోరాటంలో పాల్గొన్న దాశరథి కృష్ణమాచార్యులు గారు, శ్రీ వట్టికోట ఆల్వరు స్వామి గారు, అటువంటి మహనీయులు ఎందరో ఆ ఖిల్లా జైల్లో బంధీలుగా ఉంటూనే తమ రచనలు, కవిత్వాల ధ్వరా తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన మహనీయులు చారిత్రక ఆనవాళ్లు కలిగిన కోట ఇందూర్ ఖిల్లా అని అన్నారు.
దాశరథి గారు రాసిన నా తెలంగాణ కోటి రాతణాల వీణ అనే పదాలు అయన గడిపిన 8వ నెంబర్ గదిలో నేటికీ చెక్కు చెదారకుండా అలాగే ఉన్నాయన్నారు.
ఎత్తనా ప్రదేశంలో కుర్నాపీఠం పైన సాక్షాత్తు సీతారాములు వారు ప్రత్యక్షమై భక్తులకు దర్శనం ఇస్తూ మనకు కనిపిస్తారు, పవిత్రమైన కోనేరు, ధ్యానమందిరం, శ్రీరామ కల్యాణ వేదిక, ఇలా దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలో రఘునాథ ఆలయం ఎంతో ఆహ్లాదకరంగా కనపడాల్సిన దేవాలయం పాలకుల నిర్లక్ష్యం కారణంగా నేడు శిధిలావస్థలో ఉందని ఆవేదన వ్యక్తం చేసారు.
ఇలాంటి వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన కోట, వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన దేవాలయం, దాశరథి, వట్టికోట ఆల్వరు స్వామి లాంటి మహనీయులు, తెలంగాణ విమోచన పోరాట యోధులు ఎందరో మహనీయులు గడిపిన ప్రదేశాన్ని ఒక పర్యటన కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని డిమాండ్ చేసారు.
హిందువుల ఆరాధ్య దైవం అయినా రాములోరు సాక్షాత్తు కొలువైన ఉన్న ఆ పురాతన దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని అన్నారు.
గుడి పునః నిర్మానికి, అక్కడికి వచ్చే భక్తులకు కనీస మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఉత్తర తెలంగాణాలో అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం తోపాటు అతి పెద్ద పర్యాటక కేంద్రంగా కూడా మారుతుందన్నారు తద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఎన్నో కుటుంబాలకు ఉపాధి కలుగుతుందన్నారు.ప్రభుత్వాలు పట్టించుకోనీ కారణంగా అక్కడ దేవాలయ భూమి కబ్జాలకు గురి అవుతున్నాయన్నారు.
అక్కడే ఉన్న బొడ్డెమ్మ చెరువును మినీ ట్యాంక్ బండ్ పేరుతో గత ప్రభుత్వం 22 కోట్లనిధులు కేటాయించిన జరగవలసిన అభివృద్ధి జరగలేదని అన్నారుశ్రీరామ నవమి రోజున దాదాపు 70 – 80 వేల భక్తులు ఖిల్లా రామలయాన్ని దర్శించుకుంటారని తెలిపారు.
ఆలయాప్రాంగణంలో పవిత్రమైన కోనేరు, శ్రీరామ కల్యాణ వేదిక, దాశరథి మందిరం, గుడి గోపురం, పైకప్పు, గోడలు మరమత్తులకు, కనీస మౌలిక సౌకర్యాలు మంచి నీరు, మరుగుదొడ్లు ఏర్పాటుకు కనీసం 20 కోట్లు స్పెషల్ ఫండ్ మంజూరు చేయవలిసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరారు.
ఉత్తర తెలంగాణకు ముఖ ధ్వరం అయినా ఇందూర్ జిల్లాకి ఒక ఘనమైన చరిత్ర ఉందని దయచేసి ఇందూర్ పట్టణంలో ఉన్న రఘునాథ ఆలయా అభివృద్ధికి & ఖిల్లా కోటను పర్యటక రంగంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిందింగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
