HomeTelanganaNizamabadపంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం - రూరల్ ఎమ్మెల్యే డాక్టర్. ఆర్.భూపతిరెడ్డి

పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం – రూరల్ ఎమ్మెల్యే డాక్టర్. ఆర్.భూపతిరెడ్డి

వడగళ్ల వాన తో నస్టపోయిన రైతులకు అండగా ఉంటామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్. ఆర్. భూపతిరెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూధర్పల్లి మండలలోని వాడి, మద్దుల్ తండా,హోన్నజీపేట్ గ్రామాలలో వడగండ్ల వానతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు …….

జిల్లా జాయింట్ డైరెక్టర్, మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తీర్ణ అధికారులతో పంట నష్టాన్ని సర్వే జరిపించి , రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

ఈ సర్వే ను రెండు రకాలుగా చేస్తారని 33 శాతం కంటే తక్కువ మరియు 33% కంటే ఎక్కువగా ఉన్న పంట నష్టాన్ని బట్టి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి భరోసా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు .

గతంలో పంట నష్టపోయిన రైతులకు ఎకరా 10,000 చొప్పున ప్రభుత్వం చెల్లించిందని రాష్ట్రం మొత్తం సర్వే జరిగిన అనంతరం నష్టతీవ్రతబట్టి ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని తెలిపారు.ఆనాడు రైతుల మీద కేసులు పెట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు. .

తంబాకు బ్యాచ్ 6000 మంది రైతులను పొట్టనబట్టుకున్నది నిజం కాదా.! నష్టపోయిన రైతులను ప్రభుత్వం వారి ధాన్యం ప్రతి గింజ ఉంటుందని రైతులు అధైర్యపడవద్దని పంట నష్టాన్ని అధికారులచే సర్వే చేపించి అంచనా వేసి వారికి తగిన నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ధర్పల్లి మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, ఏ.యం.సి. చైర్మన్ ముప్పి గంగారెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్, సొసైటీ చైర్మన్లు   చెలిమెల మల్లికార్జున్, వెంకంగారి జనార్దన్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ మగ్త్య నాయక్,జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య, సీనియర్ నాయకులు మిట్టపల్లి గంగారెడ్డి, పుప్పాల సుభాష్, చెలిమెల శ్రీనివాస్, సుభాష్ రెడ్డి, భగవంతు రెడ్డి, లోక్కిడి రాములు, రోoడ్ల గంగారెడ్డి, వ్యవసాయ విస్తీర్ణ శాఖ అధికారులు మధుసూదన్, లావణ్య, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments