నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లిలో గల ఇందూరు తిరుమల ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం స్వామివారి కల్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వేడుకల్లో ఆలయ కమిటీ ధర్మకర్తలు దిల్ రాజ్, శిరీష్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. శతమానం భవతి దర్శకుడు సతీష్ విగ్నేష్,, రచయిత చిన్ని కృష్ణ, బలగం పెమ్ మధు, ఓదెలు పెమ్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
అలాగే దేవనద్ జీయర్ స్వామి , గంగోత్రి రామానుజాదాస్ స్వామి, శిఖమని ఆచార్య, రోహిత్ కుమార్ ఆచార్య, ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.