HomeTelanganaNizamabadరైతు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి..భాజపా ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష...

రైతు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి..భాజపా ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష…

రైతు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి డిమాండ్‌ చేశారు.

శుక్రవారం బీజేపీ కిసాన్ మోర్చా ఆద్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్ లో రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మాట్లాడితే దాడులు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంచిప్ప నుంచి 2021 ప్యాకేజీ వరకు రూరల్ పరిధిలో లక్ష ఎకరాలకులు సాగునీరందిస్తామని గొప్పలు చెప్పి,ఇప్పుడు ఎంతో మంది రైతుల పంటలకు నీరందక ఎండిపోతున్నాయని తెలిపారు.

అలాగే నిజాం సుగర్ ఫ్యాక్టరీ విషయం ఏమైందనీ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇచ్చిందా అని ప్రశ్నించారు.రైతుల గోస ప్రభుత్వానికి మంచిది కాదని, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతుఎడిచిన రాజ్యం బాగుపడదనీ అన్నారు.

మొన్న కురిసిన అకాల వర్షంతో జిల్లాలో ఎంతో మంది రైతుల పంటలకు నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. గతం లో ఇందూరు జిల్లాకు వ్యవసాయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఎన్నో విదేశాలకు అనేక రకాల పంటలకు ఎగుమతులు చేసిన జిల్లాలో నేడు రైతుల కంట నీరు వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇక జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ నాయకుల కండ్లు మండుతున్నాయి,పసుపు బోర్డు తీసుకొచ్చిన వ్యక్తిని అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మొన్నటి వరకు గంజ్ లో పసుపు రైతులకు మద్దతు ధర లేక రోడ్డెక్కిన కాంగ్రెస్ నేతలు కనీసం చొరవ చూపకుండా విమర్శలు చేశారని తెలిపారు.

ఇక ముఖ్యంగా కరెంట్ కొరత కారణంగా కాలువలలో నీరు ఇవ్వని కారణంగా ఎండిపోయిన వరి పొలాలకు, నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.అలాగే రూ.2లక్షల రుణ మాఫీ, 15వేల రూపాయల రైతు భరోసా, వరికి ఐదు వందల రూపాయల బోనస్‌ ఇవ్వాలన్నారు.

సాగునీరు అందక ఎండిన పంటలకు ఎకరానికి రూ.30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.వరి కోతలు మొదలైనందున సత్వరమే ఐకేపీ సెంటర్లు ప్రారంభించి సకాలంలో కొనుగోలు ప్రారంభించాలని, బస్తాల కొరత లారీల కొరత లేకుండా చూడాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, బిజెపి కిసాన్ మోర్చా నాయకులు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments