నాగారంలో ఉన్న డంపింగ్ యార్డ్ ను తరలించాలని డిమాండ్ చేస్తూ చెత్తవాహనాలనునిలిపి వేశారు. చెత్తను తమ ప్రాంతంలో వేయడానికి వీలు లేదని మండి పడ్డారు అనంతరం 10 11 డివిజన్ లకు చెందిన ప్రజలు కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేసారు
గత 15 సంవత్సరాలు నుండి డంపింగ్ యార్డ్ మొదలు పెట్టినప్పటి నుండి ఈనాటి వరకు ఎన్ని సమస్యలను మేము ఎదుర్కొంటున్నామని విపరీతమైన దుర్వాసన వస్తుందని తరుచు నిప్పు అంటుకోవడం వల్ల వచ్చే దట్టమైన పొగ తో చిన్న పిల్లలు వృద్దులు ఆస్తమా పేషేంట్ లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని
అలాగే గ్రౌండ్ వాటర్ కూడా కలుషితం అయ్యిందని గత ఐదు సంవత్సరాలుగా మున్సిపల్ కమిషనర్ మరియు అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం మున్సిపల్ అధికారులను ఎన్నిసార్లు ప్రశ్నించి అప్పటికి మాపై అక్రమ కేసులు పెడతామని ఎదురు దాడులు చేసేవారు కుక్కలు పందులబెడద కూడా ఎక్కువగా ఉందని
ఈ ప్రాంతంలో గల్లీలో ప్రజలకు ఇబ్బందులు పెడుతున్నాయి దుర్వాసనలు వస్తున్నాయి గత 15 రోజులుగా భారీ ఎత్తున గా మంటలు వ్యాపిస్తున్న ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి మాతో కాదని వెళ్ళి పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు
పోలీస్ స్టేషన్ లోనూ కంప్లైంట్ చేయగా ఫైర్ ఇంజన్ వారిని పిలిపించారు ఫైర్ ఇంజన్ వాళ్ళు మంటలను అదుపు చేయలేకపోయారు జిల్లా కలెక్టర్ తమ పరిస్థితిని అర్థం చేసుకొని వీలైనంత త్వరగా దయచేసి మా సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
