పిట్లం మండలం సిద్ధాపూర్ గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద శుక్రవారం ఉదయం పిట్లం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బుచ్చయ్య మృతి చెందాడు.
చెరువు కట్ట వద్ద విగతజీవిగా పడి ఉన్న మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ రాజు సంఘటన స్థలానికి చేరుకొని, ఉదయాన్నే పరిశీలించారు.
ఈ విషయమై ఎస్ఐ ని వివరణ కోరగా, పిట్లం నుంచి బాన్సువాడ వైపు వెళుతుండగా సిద్దాపూర్ సమీపంలో చెట్టు ఢీకొని రాత్రి మృతి చెందినట్లు వివరించారు.
