కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా ఈరోజు సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు ఎగరవేయడం జరిగింది.
అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గం ఎనిమిది గంటల పనితో పాటు తమ హక్కుల సాధన కోసం పాడిన సందర్భంలో పాలకులు వారిపై కాల్పులు జరిపి ఉద్యమాన్ని అణచాలని చూసారని.
కానీ వారు ఈ పోరాట స్ఫూర్తితో నాటి నుండి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం తమ హక్కుల పోరాటం కోసం ప్రతిజ్ఞ తీసుకోవడం జరుగుతుందని హలో భాగంగానే మేడేను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.
నేటి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గం హక్కులను హరించే విధంగా పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దుచేసి పెట్టుబడిదారులకు కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే పద్ధతిని అవలంబిస్తున్నదని.
ప్రజాధనాన్ని కొద్దిమంది వ్యక్తులకు కట్టబెడుతుందని. వాటిని కప్పిపుచ్చుకోవటానికి ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టి మత వైశ్యామ్యాలను పెంచుతుందని.
అందులో భాగంగానే కాశ్మీర్లోని పాహల్గాం అడ్డుపెట్టుకొని మతవిద్వేషాలని పెంచాలని చూస్తున్నారని ఆయన అన్నారు కానీ మే డే స్ఫూర్తిగా కార్మిక వర్గం కుల ,మత, ప్రాంత విభేదాలను విడనాడి ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాటం చేయాలని ,ఐక్యంగా పోరాటాల ద్వారా మాత్రమే తమ హక్కులను కాపాడుకోగలుగుతామని అన్నారు
రోజు రోజుకి కార్మిక వర్గం ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని నిత్యవసర సరుకుల ధరలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కొద్దిమంది గ**** పెట్టుబడుదారులకు ప్రజల ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని వీటికి వ్యతిరేకంగా ప్రజలందరూ సమైక్యంగా పోరాడి కాపాడుకోవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు నూర్జహాన్, విరాలు సుజాత ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్, నగర నాయకులు కటారి రాములు మరియు వివిధ రంగాల కార్మికులు రఫిక్, అంజయ్య, ఉద్ధవ్, స్వర్ణ, రేణుక, విగ్నేష్ దినేష్ తదితరులు పాల్గొన్నారు.
దీంతో పాటు మున్సిపల్, కార్యాలయ వద్ద జెండా ఆవిష్కరణ చేశారు
