తండ్రి తాగడానికి డబ్బు ఇవ్వలేదని కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి లో జరిగింది .
గ్రామానికి చెందిన మర్రి ప్రవీణ్ (24) తాగుడుకు బానిసై తరచూ కుటుంబ సభ్యులను డబ్బులు అడుగుతుండేవాడు. గత రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో తండ్రి స్వామిని మందు తాగడానికి డబ్బులు అడిగాడు.
తండ్రి ఇవ్వకపోవడంతో, తీవ్ర మనస్థాపానికి గురైన ప్రవీణ్, తన ఇంట్లో ఉన్న బెడ్ రూమ్ గదిలోకి వెళ్లి, ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకున్నాడు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
