HomeCRIMEయజమాని మర్మాంగాలు కొరికేసిన కుక్క

యజమాని మర్మాంగాలు కొరికేసిన కుక్క

కంటికిరెప్పలా కాపాడాల్సిన ఓ పెంపుడు కుక్క.. యజమాని నే అంతం చేసింది. హైదారాబాద్ మధురా నగర్‌ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో పవన్ కుమార్ (37) నివాసం ఉంటున్నాడు.

ఆదివారం రాత్రి తన పెంపుడు కుక్కను రోజూలాగే తన పక్కనే పడుకోబెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే దారుణం చోటుచేసుకుంది. పవన్ కుమార్ మర్మాంగాలను ఆ పెంపుడు కుక్క కొరుక్కు తినేసింది.

దీంతో బాధితుడు .. ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం పవన్ స్నేహితుడు వచ్చి తలుపు తట్టగా.. ఎంతకీ అతడు డోర్ ఓపెన్ చేయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా.. అచేతన స్థితిలో పవన్ కుమార్ పడి ఉన్నాడు.

అక్కడే ఉన్న పెంపుడు కుక్క నోటి నిండా రక్తంతో కనిపించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments