Sunday, April 19, 2026
HomeTelanganaNizamabadకాంగ్రెస్ లో కలకలం రేపిన నేత ఎలమంచిలి వ్యవహారం ......ఎట్టకేలకు సస్పెన్షన్ .....ఫలించిన పోచారం...

కాంగ్రెస్ లో కలకలం రేపిన నేత ఎలమంచిలి వ్యవహారం ……ఎట్టకేలకు సస్పెన్షన్ …..ఫలించిన పోచారం ఒత్తిడి …….రగులుతున్న ఏనుగు

బాన్స్ వాడ కాంగ్రెస్ లో నేతల మధ్య ఆధిపత్య పోరు పరాకాష్ట కు చేరింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎలమంచిలి శ్రీనివాసరావు పై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటువేయడం కలకలం రేపింది.

తెర వెనుక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన ఒత్తిడి అధిష్టానం తలొగ్గడం క్యాడర్ జీర్ణించుకోలేక పోతుంది.ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు వర్గం లోలోపల రగిలి పోతుంది.

పార్టీ కి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంటూ అధిష్టానం కు ఫిర్యాదులు అందడంతో ఆయనకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు ఇచ్చారు ఈ నోటీసులకు జవాబు ఇవ్వకపోవడంతో ఆయనపై క్రమశిక్షణలో భాగంగా సస్పెన్షన్ వేటు వేసారు.

టీడీపీ, బిఆర్ యస్ లను తట్టుకొని దశాబ్దాలు కాంగ్రెస్ క్యాడర్ కు అండగా వుంటూ వస్తున్నారు. అనేక అసెంబ్లీ టికెట్ కోసం చివరిదాకా యత్నించి విఫలం అయ్యారు అయినా కాంగ్రెస్ పార్టీ వైపు గట్టిగా నిలబడుతూ వచ్చారు

అందుకే బాన్స్ వాడ నియోజకవర్గంలో సీనియర్ నాయకులుగా ఎలమంచిలి శ్రీనివాసరావుకు గుర్తింపు ఉంది వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందినఆయన గతంలో వర్ని వైస్ ఎంపీపీ గా పనిచేసారు ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలోనే సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఆయన పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నారు

గత పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత గా క్రియాశీలకంగా పనిచేసారు నాయకులు కార్యకర్తలపై కేసులు నమోదు అవుతే స్వతహాగా ఆయనే న్యాయవాదులను ఏర్పాటు చేసి కార్యకర్తలకు అండగా నిలిచారు.

నియోజకవర్గం లో కీలక నేతగా కొనసాగారు పార్టీ అధికారం కోల్పోయాక ప్రతిపక్షంలో సైతం పదేళ్లపాటు అధికార టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బాన్సువాడ నియోజకవర్గంలో పార్టీ నాయకులను కార్యకర్తలను కాపాడుతూ వచ్చారు

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలమంచిలి శ్రీనివాసరావు సైతం కాంగ్రెస్ పార్టీ టికెట్ను బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఆశించారు పార్టీ అధిష్టానం ఏనుగు రవీందర్ రెడ్డి కి పార్టీ టికెట్ కేటాయించడంతో ఆయనకు మద్దతుగా నియోజకవర్గంలో కొనసాగుతూ వచ్చారు

ఎంపీ ఎన్నికల అనంతరం టిఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఎలమంచిలి శ్రీనివాసరావు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి కి అనుకూలంగా ఉన్నారు.

ఇటీవలే ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆత్మ హత్య ఘటన లో మృతదేహం ఆందోళన చేశారు ఎమ్మెల్యే పోచారం వేధింపుల వల్లే కార్యకర్త అసువులు మృతి చెందారంటూ శ్రీనివాస్ బాహాటంగా ధ్వజమెత్తారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనపై పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంటూ వేటు వేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది గత ఎన్నికల్లో తనకు గట్టి మద్దతు దారుడిగానిలిచిన ఎలమంచిలి శ్రీనివాసరావు పై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేయడం తో రవీందర్ రెడ్డి రగిలి పోతున్నారు.

మొత్తానికి అధికార పార్టీలో ఈ మద్యే ఎంట్రీ ఇచ్చిన పోచారం క్రమంగా పార్టీలో పట్టు సాధించే పనిలో ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!