నగరంలోని రాయల్ ఓక్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కంటేశ్వర్ బైపాస్ రోడ్డులోనీ రాయల్ ఓక్ ఫర్నిచర్ షో రూములో తెల్లవారు జామున ఒక్క సరిగా మంటలు చెలరేగాయి.
దీంతో అక్కడ ఉన్న స్థానికులు గమనించి అగ్ని మాపక శాఖ కు సమాచారం అందించారు. హుటాహుటిన అగ్ని మాపకశాఖ ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.
సుమారు రూ 10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందనీ ఫైర్ స్టేషన్ అధికారులు అంచనా చేశారు.
