టిప్పర్ ఢీ కొని వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన మాక్లూర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం..
మండలంలోనీ ముల్లంగి గ్రామానికి చెందిన బురోళ్ళ లక్ష్మణ్(69).మంగళవారం ఉదయం మాదాపూర్ లో టిఫిన్ చేయడానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో బొంకన్ పల్లి నుంచి మాదాపూర్ వైపుగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.
