నగరంలో ఓ మహిళ ఆకిలి ఊడుస్తుండగా గుర్తు తెలియని దుండగులు మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం..నాగారం లోని 300క్వార్టర్స్ కు చెందిన చందా సావిత్రి ఉదయం ఇంటి ముందు ఆకిలి ఊడుస్తుండగా గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనం పై వచి ఆమె మెడలో నుంచి రెండున్నర తులాల బంగారం పుస్తెలతాడు లేకెళ్ళినట్లు తెలిపారు.
దీంతో బాధితుల సమాచారం మేరకు పోలీసులకు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించినట్లు తెలిపారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గంగాధర్ తెలిపారు.
