HomeCRIMEనిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో విషాదం..--ముగ్గురు యువకుల గల్లంతు.--మధ్యాహ్నం క్రికెట్ ఆడిన యువకులు.--సాయంత్రం ఈతకు వెళ్లగా...

నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో విషాదం..–ముగ్గురు యువకుల గల్లంతు.–మధ్యాహ్నం క్రికెట్ ఆడిన యువకులు.–సాయంత్రం ఈతకు వెళ్లగా ఘటన–గాలిస్తున్న గజ ఈతగాళ్లు. –సంఘటన స్థలంలో పోలీసులు, గ్రామస్తులుఎల్లారెడ్డి.

సాయంత్రం వరకు స్నేహితులతో అహల్లాదకరంగా క్రికెట్ ఆడిన ముగ్గురు యువకులు నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో గల్లంతైన విషాదకరమైన సంఘటన ఎల్లారెడ్డి మండలంలో సోమవారం సాయంత్రం జరిగింది.

మండలంలోని సోమరిపేట గ్రామానికి చెందిన హర్షవర్ధన్ (16), తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన నవీన్ (17), ఎల్లారెడ్డి పట్టణానికి చెందినిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో విషాదం..

–ముగ్గురు యువకుల గల్లంతు.–మధ్యాహ్నం క్రికెట్ ఆడిన యువకులు.–సాయంత్రం ఈతకు వెళ్లగా ఘటన–గాలిస్తున్న గజ ఈతగాళ్లు. –సంఘటన స్థలంలో పోలీసులు, గ్రామస్తులుఎల్లారెడ్డి. న మధుకర్ గౌడ్ (17) నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో గల్లంతయ్యారు.

రాత్రి 9 అయినా వారి మృతదేహాలు లభ్యం కాకపోవడంతో గజ ఈతగాళ్లు బ్యాక్ వాటర్ లో మృతదేహాల కోసం గాలిస్తున్నారు.

ఈ విషాద సంఘటనకు సంబంధించి న వివరాలు గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. మండలంలోని సోమార్పేట్ గ్రామంలో 11 మంది యువకులు క్రికెట్ ఆడారు. సాయంత్రం ఆట ముగిసేసరికి చెమటతో తడిసిపోయారు.

దీంతో అందరు కలిసి సోమార్పేట్ నిజాంసాగర్ మండలం హసన్పల్లి గ్రామంలో మధ్య గల నిజాంసాగర్ బ్యాక్ వాటర్ వద్దకు వెళ్లారు. 11 మంది స్నేహితులు స్నానం చేసేందుకు బ్యాక్ వాటర్ లోకి దిగారు.

ఈత వచ్చిన కొంతమంది ముందుకు ఈదుకుంటూ వెళ్లారు. కొంచెం లోనికి వెళ్లిన హర్షవర్ధన్, నవీన్, మధుకర్ గౌడ్ నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో ఉన్న బురదలో చిక్కుకున్నారు. వారు బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఆహాకారాలు చేశారు.

ఒడ్డుకు దగ్గరలోనే స్నానం చేస్తున్న మిగతా ఎనిమిది మందికి పెద్దగా ఈత రాదని చెప్పారు. దాంతో వారు కూడా అరుపులు పెడ బొబ్బలు పెట్టారు.

వారు అరుస్తూ ఉండగానే ముగ్గురు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు. వెంటనే మిగతా యువకులు గ్రామానికి వచ్చి గ్రామస్తులకు విషయం గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి, నిజాంసాగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సాయంత్రం ఏడున్నర ప్రాంతంలో గజ ఈతగాళ్లను రప్పించి గల్లంతైన యువకుల కోసం వెతికించారు.

రాత్రి కావడంతో పరిస్థితులు అనుకూలంగా లేవు అని పోలీసులు చెప్పారు. యువకుల మృతదేహాల మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు.

విషయం తెలిసిన యువకుల కుటుంబీకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో నిజాంసాగర్ బ్యాక్ వాటర్ వద్దకు చేరుకున్నారు. యువకుల కుటుంబీకుల అర్ధనాదాలు చేస్తుండడంతో అందరినీ కలిసివేసింది. ముగ్గురు యువకులు ఒకేసారి గల్లంత కావడంతో విషాదం అలుముకుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments