HomeTelanganaNizamabadజిల్లాకు బెర్త్ ఫై తొలగని ఉత్కంఠ ? .....సుదర్శన్ రెడ్డి కోసం పట్టు వదలని రేవంత్...

జిల్లాకు బెర్త్ ఫై తొలగని ఉత్కంఠ ? …..సుదర్శన్ రెడ్డి కోసం పట్టు వదలని రేవంత్ ? ……..ఈసారి కూడా జిల్లాకు ప్రాతినిధ్యం లేనట్లేనా ?

మంత్రి వర్గ విస్తరణ కోసం కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు లైన్ క్లియర్ చేసింది . ఆదివారం లేదా సోమవారం విస్తరణ జరగబోతుంది.ముగ్గురు లేదా నలుగురికి చోటు దక్కనుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.

కానీ జిల్లాకు మంత్రి వర్గంలో ఈసారైనా ప్రాతినిధ్యం దక్కుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది.మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ పట్టుబడుతున్నారు.

శుక్రవారం ఇంచార్జ్ మీనాక్షి తో జరిగిన భేటీ లోనూ రేవంత్ రెడ్డి ఇదే అంశంను ప్రస్తావించారు. ఈ భేటీ తర్వాతే సుదర్శన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం గమనార్హం. ఆయనకు అధిష్ఠానము నుంచి ఎలాంటి ఊరట దక్కింది ? అనేది బయటికి పొక్కడం లేదు.

ఈసారి సామజిక సమీకరణ ల నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి కి మంత్రి పదవి ఇవ్వడానికి అధిష్టానం వెనుకాడుతుంది. కానీ తనకు పీసీసీ పీఠం దక్కేలా పనిచేసిన వారిలో సుదర్శన్ రెడ్డి ఒకరు . అదీగాక సమీప బంధువు కావడంతో ఆయన కోసం రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దల మీద ఒత్తిడి చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు యేడాదిన్నర కాలం కావొస్తుంది. అయినప్పటికి రాష్ట్ర మంత్రి వర్గం లో జిల్లాకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.

తోలి దఫా లోనే జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి మంత్రి పదవీ ఖాయం అని ప్రచారం జరిగింది. ఉమ్మడి జిల్లాలో నలుగురు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే లుగా గెలిచారు కానీ మిగితా ముగ్గురు మొదటి ఎమ్మెల్యే లుగా ఎన్నికయ్యారు. కానీ సుదర్శన్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యే అదీగాక గతంలో మంత్రి గా పనిచేశారు.అందుకే ఆయన రేవంత్ క్యాబినెట్ లో కొలువు పక్క అనుకున్నారు.

కానీ హైకమాండ్ మాత్రం ఆయను స్పీకర్ బాధ్యతలు అప్పగించడానికి సిద్ధం అయింది కానీ ఆయన స్పీకర్ పోస్టు తీసుకోవడానికి ఆయన ససేమిరా అన్నారు. దీనితో మంత్రి పదవి కట్టబెట్టడానికి ఢిల్లీ పెద్దలు ఒప్పుకోలేదు.

అందుకే ఆయన మంత్రి పదవీ పెండింగ్ లో పడింది. రేవంత్ రెడ్డి పట్టుబడుతున్న నేపథ్యంలో బిసి వాదం ను తెరమీదికి తెచ్చారు అదే సుదర్శన్ రెడ్డికి ఇప్పుడు ప్రతికూలంగా మారింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments