రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది . ఆదివారం లేదా సోమవారం ముహూర్తం ఖరారు అయింది. ఈ మేరకు కేబినెట్‌లో ప్రస్తుతం ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా..
అందులో మూడు లేదా నాలుగు స్థానాలను భర్తీ చేయనున్నారు. శుక్రవారం జరిగిన సీఎం రేవంత్ రెడ్డి తో ఇంచార్జ్ మీనాక్షి భేటీ లో ఫైనల్ అయింది.
శనివారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో ను మీనాక్షి సమావేశం అయ్యారు.ఇందులోనూ క్యాబినెట్ విస్తరణ మీదే చర్చ జరిగింది.
/// ముగ్గురు లేదా నలుగురు? /////
క్యాబినెట్ విస్తరణలో ముగ్గురికి లేదా నలుగురికి అవకాశం దక్క బోతుంది ఆరు ఖాళీలు ఉన్నాయి మొదట ముగ్గురి కే క్యాబినెట్ లో తీసుకోవాలని భావించారు కానీమైనార్టీ కోట పైన ఎడతెగని కసరత్తు జరిగింది మైనార్టీ కి ఇస్తే నాలుగో స్థానం భర్తీ అవుతుంది.
////ముగ్గురెవరు ? /////
ముగ్గరు కొత్తగా క్యాబినెట్ లో చేరబోతున్నారు. ఈ ముగ్గురెవరనేది ఉత్కంఠ గా మారింది. ముగ్గురి లో ఒక)( రెడ్డి )రాజ్ గోపాల్ రెడ్డి, (ఎస్సి ) గడ్డం వివేక్ (బీసీ ) శ్రీహరి . లకు బెర్త్ లు ఖరారు అయ్యాయి.
