HomeTelanganaNizamabadబీభత్సం సృష్టించిన ఈదురు గాలులు……రోడ్ల మీదే కూలిన చెట్లు ………సహాయక చర్యల చేపట్టిన పోలీస్ ……….రంగంలోకి...

బీభత్సం సృష్టించిన ఈదురు గాలులు……రోడ్ల మీదే కూలిన చెట్లు ………సహాయక చర్యల చేపట్టిన పోలీస్ ……….రంగంలోకి కమిషనర్

నిజామాబాద్ జిల్లాలో గత రాత్రి భారీ ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అనేక ప్రాంతాల్లో భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్ల మీద పడడం తో రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలిగింది అనేక ప్రాంతాలు రాత్రంతా అంధకారం లో ఉండి పోయాయి.

రోడ్ల మీద పడిన చెట్లు స్తంబాలు లను తొలగించడానికి పోలీసులు రంగంలోకిదిగారు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు.

ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూడాలని,జెసిబి ల సహాయం తో చెట్లను తొలగించారు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య,స్వయంగా ఈ పనులను పర్యవేక్షించారు.


పలు ప్రాంతాలలో తిరిగారు
ఇలాంటి ఆపత్కాల పరిస్థితులలో ప్రజలు వెంటనే పోలీస్ లకు సమాచారం అందిస్తే అవసరం అయిన సహాయం అందిస్తాము అని , ప్రజల భద్రత సౌకర్యం కోసం పోలీసులు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారని కమిషనర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

జిల్లాలో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ స్థంబాలు నేలకూలాయి. దీనితో విద్యుత్ తీగలు రోడ్ల మీద పడడం తో ప్రజలు భయకంపితులయ్యారు.

విద్యుత్ సిబ్బంది రాత్రంతా రోడ్ల మీదే ఉండి సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచి పొగ సిబ్బంది వెంటనే మరమ్మతు లుచేసి సరఫరా పునరుద్ధరించారు.ఒక్క నగరంలోనే 17 చోట్ల విద్యుత్ స్తంబాలు విరిగి పోయాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments