నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ గా బదిలీ చేశారు. అలాగే రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్గా, భూభారతి కమిషనర్ గానూ అదనపు బాధ్యతలు అప్పగించింది.ఆయన స్థానంలో నూతన జిల్లా కలెక్టర్ గా2013 ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన టీ.వినయ్ కృష్ణారెడ్డి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.ఈయన ప్రస్తుతం ఐ అండ్ క్యాడ్ కమిషనర్గా ఉన్నారు.
