ఇందూర్ జిల్లా కలెక్టర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన టి. వినయ్ కృష్ణ రెడ్డిని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
ఈ సందర్బంగా జిల్లా స్థితిగతులపై చర్చిస్తూ ఇందూర్ నగరం అభివృద్ధిపైన ప్రత్యేక ద్రుష్టి సరించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలియజేసారు.
జిల్లా అభివృద్ధి కార్యక్రమాలకు పార్టీలకు అతితంగా తన సహాయాసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఎమ్మెల్యే తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మినారాయణ,ప్రభాకర్, ఆనంద్, పవన్ ముందడ, మరవర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
