HomePOLITICAL NEWSUncategorizedపోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమం ప్రారంభించిన సిపి..

పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమం ప్రారంభించిన సిపి..

పోలీస్ విధినిర్వహణలో సామర్థ్యం పెంచడానికి తెలంగాణా రాష్ట్రంలో రెండవ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమీషనరేటులో వివిధ రంగాలలో పోటీలు నిర్వహించారు.

ఈ పోటీల ద్వారా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ స్థాయి నుండి ఎ.సి.పి స్థాయి వరకు పని పద్దతులు మెరుగుపడి ఇన్వేస్టిగేషన్ స్థాయిలు పెరుగుతాయి , పనిలో పోటీతత్వం అలవాటుపడుతుందనీ అన్నారు.

సైంటిఫిక్ ఇన్వేస్టిగేషన్ , ఫింగర్ ప్రింట్ ఇన్వేస్టిగేషన్ కోసం ఎంపికలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమీషనరేటులో నేరాలు జరిగినప్పుడు అట్టి నేర స్థలంలో సేకరించవలసిన నేర సమాచారం కోసం ” పోలీస్ క్లూస్ ” ఏ విధంగా సేకరించాల అనేదని కోసం ఎంపిక పరీక్షలు నిర్వహించడం జరిగింది.

ఇందులో భాగంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సమక్షంలో సి.ఐలు, ఎస్.ఐలు మరియు సిబ్బందికి ఎంపిక పరీక్షలు ప్రారంభించారు. ఇందులో ఫోరన్సిక్ సైన్స్ ఫింగర్ ప్రింట్ , లిఫ్టింగ్ మరియు ప్యాకింగ్, ఐ.ఓ ఫోటో గ్రాఫి , వీడియోగ్రాఫీల కోసం ఎంపికలు నిర్వహించడం జరిగింది.

ఎ.ఎస్.ఐ నుండి కానిస్టేబుల్ వరకు వారి అబ్జ ర్వేషన్ పని తీరును మెరుగుపర్చడం, పరీక్షించడం అబ్జర్వేషన్ పరీక్ష, నిందితులను గుర్తించే పరీక్ష మొదలగునవి నిర్వహించడం జరిగింది.

ఇందులో మంచి ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే డ్యూటీ మీట్ కార్యాక్రమానికి పంపడం జరుగుతుంది. ఈ కార్యాక్రమంలో నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్) బస్వా రెడ్డి , సి.సి.ఎస్. ఎ.సి.పి నాగవేంద్ర చారీ , CCRB ఏసీపీ రవీందర్ రెడ్డి , సి.ఐలు, ఎస్.ఐలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments