నిజామాబాద్ చిన్న వయసులోనే అసాధ్యాన్ని సాధించిన నిజామాబాద్ యువకుడు శివప్రసాద్‌ను కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా సన్మానించారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ జిల్లాలో 3810 మీటర్ల ఎత్తులో ఉన్న చంద్రశీల పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన శివప్రసాద్ నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మైనారిటీల సలహాదారు షబ్బీర్ అలీ, రాష్ట్ర సలహాదారు మానాల మోహన్, టీఎస్ఎ్సపీఎస్ చైర్మన్ ఇరావతి అనిల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నుడా చైర్మన్ కేశవ వేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతా రాజిరెడ్డి, కార్పొరేటర్లు, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.
శివప్రసాద్ విజయానికి అభినందనలు తెలియజేస్తూ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, “ఇలాంటి యువత మన రాష్ట్రానికి గర్వకారణం. అధిరోహించిన శిఖరాలా, ఈ యువకుడి జీవిత విజయాలు కూడా ఎన్నో ఉండాలి” అన్నారు.ఈ సందర్భంగా శివప్రసాద్‌కు సన్మాన పత్రం, స్మృతిచిహ్నం అందజేశారు.
