హైదరాబాద్ బాలానగర్ లో గంజాయి నిల్వలున్నాయనే సమాచారం మేరకు ఆదివారం తనిఖీలకు వెళ్లిన ఓ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందాడు.
ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నట్లుగా సమాచారం రావటంతో తనిఖీల వెళ్లారు బాలనగర్ జోన్ పోలీసులు. తనిఖీలు నిర్వహిస్తుండగా ఎస్ వోటీ కానిస్టేబుల్ ప్రవీణ్ (39) ఒక్కసారిగా గుండె పోటు రావటంతో నిల్చున్న దగ్గరే కుప్పకూలిపోయాడు.
గుండెను పట్టుకుని అలాగే కూర్చునిపోయిన కానిస్టేబుల్ పరిస్థితిని గమనించిన సిబ్బంది.. పీసీఆర్ చేశారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
