నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పోలీసు ప్రజావాణికి శ్రీకారం చుట్టారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీసుస్టేషన్లకు ఎవరైనా తమ సమస్యలను నేరుగా వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చు.
ఇందుకోసం ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.
ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి 28 అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల యొక్క ఎస్.ఐ, సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేసినట్లు తెలిపారు.
ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవలను వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య తెలిపారు.
అలాగే ప్రజాసమస్యల పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని సూచించారు.
