ఇసుక రవాణా తీవ్ర ఆర్థిక భారం కావడంతో ఇసుక ధర అనూహ్యంగా పెరుగుతుంది. అందుకే సామాన్యులకు ఇసుక అందుబాటు లో లేకుండా పోయింది.
నయా పైసా పెట్టుబడి లేకుండా భారీ ఆదాయం సమకూర్చే ది ఒక్క ఇసుక దందా మాత్రమే ! అందుకే అక్రమ దందా ల్లో ఆరి తేరిన వారంతా ఇప్పుడు ఇసుక అక్రమ రవాణా దందా లో కింగ్ లుగా చెలామణి అవుతున్నారు.
నిజామాబాద్ నగరంలో ని గంగాస్టాన్ ప్రాంతానికి చెందిన ఓ ముఠా ఇప్పడు ఆయా ప్రాంతాల నుంచి నాన్ పర్మిట్ ఇసుక ను యథేచ్ఛగా జిల్లాకు తరలిస్తోంది. వర్షా కాలం మొదలు కావడంతో డిమాండ్ మేరకు ఇసుక అందుబాటు లో ఉండేలా భారీగా డంప్ చేసుకుంటున్నారు.
వర్షాలు పడితే చెరువు లు వాగుల్లో ఇసుక లభ్యత తగ్గిపోతుంది అందులోనూ ఇసుక రవాణా క్లిష్టంగా మారుతుంది. అందుకే అక్రమార్కులు ముందు జాగ్రత్తగా ఇసుక తరలింపు పక్రియ ను జోరుగా చేస్తున్నారు.
గంగాస్టాన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కోరుట్ల మెట్పల్లి మధ్య ఉండే కథలాపూర్ నుంచి ట్రాక్టర్ల ద్వార ఇసుక పగటి పూట తరలించి సమీప ప్రాంతాలో డంప్ చేసి తెల్లవారు జామున డంప్ లనుంచి నేరుగా గిరాకీ ఉన్న ప్రాంతాలకు తరలిస్తున్నారు. పది రోజుల క్రితం ఈ దందా మొదలయింది.
దాదాపు 20 టిప్పర్లు, లారీ లు ఆయా డంప్ లనుంచి ఇసుక ను నిజామాబాద్ నగరానికి తరలిస్తున్నాయి.గ్రామాభివృద్ధి కమిటీ ల సంఘీబావం తో వాగు లోనుంచి ఇసుక ను తోడేస్తున్నారు.
అక్కడి నుంచి ట్రాక్టర్ లమీదుగా ఇసుక ను కమ్మర్ పల్లి ప్రాంతంలో ఓ ఢాబా హోటల్ సమీపంలో తరలిస్తున్నారు. అక్కడి డంప్ అవుతున్న ఇసుక ను టిప్పర్ల తో తెల్లవారు మూడు నుంచి నిజామాబాదు నగరానికి తరలిస్తున్నారు.
కోరుట్ల నుంచి నిజామాబాద్ దాక సాగె ఇసుక రవాణా సవ్యంగా సాగడానికి భారీగా గానే వ్యయం అవుతుంది.రవాణా ఖర్చులే తడిసి మోపెడు అవుతుండడం వల్లే ఇసుక ధర యథేఛ్ఛ గా పెరిగిపోయింది.
దారి పొడుగునా ఆయా పోలీసు స్టేషన్ లను దాటుకొని రావడానికి ఒక్కో టిప్పర్ కు అయిదు వేల రూపాయలు ముట్టజెప్పాల్సి వస్తుంది. గంగాస్టాన్ గ్యాంగ్ రోజు 20 నుంచి 25 టిప్పర్ల నిజామాబాద్ నగరానికి తెస్తున్నారు. గంగాస్టాన్ పేస్ 2 శివారు లోనూ ఇసుక నిల్వలు చేసి పెడుతున్నారు.
0009, 8838,7710 ,8188 ,1945 2799 నెంబర్ లున్న వాహనాలలో యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారని కొందరు అజ్ఞాత వ్యక్తులు సమాచారం సంబంధిత అధికారులకు పిర్యాదు చేస్తున్న ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు.
