నిజామాబాద్ తెలంగాణ విశ్వవిద్యాలయం (టీయూ) పీజీ న్యూబాయ్స్ హాస్టల్లో ఆహారంలో పురుగు కనిపించడం విద్యార్థుల్లో ఆగ్రహాన్ని రేపింది. సోమవారం రాత్రి విందులో పురుగు రావడంతో విద్యార్థులు మంగళవారం ఉదయం నుండి హాస్టల్ ప్రాంగణంలో నిరసనకు దిగారు.
చీఫ్ వార్డెన్, వార్డెన్ అక్కడికి చేరుకుని సమస్య పరిష్కరించడానికి ప్రయత్నించినప్పటికీ, తాము వీసీ రావేవరకు ఆందోళన విరమించబోమని విద్యార్థులు తేల్చిచెప్పారు.
పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హాస్టల్ ప్రాంగణం హోరెత్తింది.విద్యార్థులు సౌకర్యాల లోపం, నిర్లక్ష్యపు పర్యవేక్షణపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తగిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
