HomeTelanganaNizamabadఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో హోరాహోరీ .......రాజకీయ రచ్చ గా మారుతున్న ప్రచారం ......

ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో హోరాహోరీ …….రాజకీయ రచ్చ గా మారుతున్న ప్రచారం ……

నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలుహోరాహోరీగా మారాయి. ప్రచారం రాజకీయ రచ్చగా మారాయి. ఈ నెల6న ఎన్నికల పోలింగ్ జరగనున్నది నగరంలో ప్రధాన కులసంఘాల కు దీటుగా పట్టణ వైశ్య సంఘం మారింది .

ప్రతియేటా సంఘం ఎన్నికలు హోరాహోరీగానే సాగుతాయి.అయితే ఈసారి ఎన్నికల ప్రచారం రాజకీయ రచ్చగా మారింది.బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఇద్దరు అభ్యర్థులు పోటీబోతున్నారు ధన్‌పాల్ శ్రీనివాస్, అరవపల్లి పురుషోత్తం.

ఈ ఎన్నికలు స్థానిక సంస్థ ఎన్నికలకు తగ్గదగ్గ ఉత్కంఠను కలిగిస్తున్నాయి. అరవపల్లి పురుషోత్తం గారు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించగా, తన గత అధ్యక్షతలో చేసిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ హామీల వర్షం కురిపిస్తున్నారు.

ముఖ్యంగా:పేద, మధ్య తరగతి వైశ్య కుటుంబాలకు ప్రత్యేక హెల్త్ కార్డు ప్రారంభిస్తానని,ప్రఖ్యాత హాస్పిటళ్లలో వైశ్యుల కోసం 10–20% మెడికల్ బిల్లుల మినహాయింపు కల్పించనున్నట్లు తెలిపారు,వైశ్య కమ్యూనిటీ ట్రెజరీ ఏర్పాటుచేసి, తక్కువ వడ్డీకే రుణాలు అందించేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు.ఇంతేకాకుండా, పట్టణ సంఘానికి చెందిన ఆస్తుల వివరాలు కూడా గమనించదగినవే.

అర్వపల్లి పురుషోత్తం కల్యాణ మండపం , పూలన్ చౌరస్తా నుండి ఆర్ఆర్ చౌరస్తా వైపు వెళ్తున్నప్పుడు ప్రధాన రహదారి పైన సొంత స్మశాన వాటిక స్థలంలో ఉన్న కమర్షియల్ షెటర్స్ వైశ్య పట్టణ సంఘ సొంత బిల్డింగ్ వాటి కమర్షియల్ షెటర్స్ నుంచి నెలకు లక్షల రూపాయల ఆదాయం వస్తోంది.

ఇవి అన్ని కలిసి సంఘ ఆర్థికంగా బలపడటానికి సహాయపడతున్నాయని పురుషోత్తం పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, ధన్‌పాల్ శ్రీనివాస్ గారు ఇంకా ప్రచారాన్ని ప్రారంభించనప్పటికీ, ఆయన కూడా దూకుడు ప్రదర్శించనున్నట్లు సమాచారం.

ఆయన్ను అనుసరించే అనేక మంది సభ్యులు ఇప్పటికే ప్రచారానికి రంగం సిద్ధం చేస్తున్నారు.ఈ ఎన్నికల తతంగం మొత్తంగా ఎమ్మెల్యే స్థాయి ఎన్నికలను తలపిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

అభ్యర్థుల హామీలు, ప్రచార రీతులు, సంఘానికి ఉన్న ఆస్తుల వివరాల నేపథ్యంలో ఈసారి ఆర్యవైశ్య సంఘ ఎన్నికలు ఆయా పార్టీ ల్లో ఉన్న నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments