తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు గేట్లను రెండు రాష్ట్రాల అధికారులు తెరిచారు. సుప్రీం తీర్పు ప్రకారం ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన గేట్లను ఎత్తుతారు.. గేట్ల ద్వారా వరద నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు.
ఈ వరద ఎస్సారెస్పీ ప్రాజెక్టు లోకి చేరనుంది. దీంతో గోదావరి పరివాహ ప్రజలనుముందస్తు జాగ్రత్తగాఅధికారులు అప్రమత్తం చేశారు. తిరిగి గేట్లను అక్టోబర్ 28న మూసివేస్తారు.
