తొమ్మది మాసాలు మోసిన ….ఎన్నో వ్యయ ప్రయాసలతో పండంటి కొడుకు కు జన్మ నిచ్చిన ఓ తల్లి ఇంకా పురిటి నొప్పుల బాధ తగ్గక ముందే ఆ పసి కందును అమ్మకానికి పెట్టింది. పుట్టిన మూడు రోజులకే పండంటి మగ బిడ్డని కొనుగోలు చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రి సాక్షిగా ఓ ముఠా బేరాలు ఆడింది. రెండు లక్షలు ఇవ్వడానికి ఆశ చూపి ఒక్క లక్ష రూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుకుంది.
చేసుకున్న బేరం బెడిసి కొట్టడం తో ఆ తల్లి అమ్మతనం గుర్తొచ్చింది. దళారీ నుంచి తీసుకున్న లక్ష రూపాయలు తిరిగి ఇచ్చేసి బిడ్డ ను వాపసు ఇప్పించాలని బాధిత మహిళా పోలీసులను ఆశ్రయించింది. నిజామాబాద్ నగరంలోని నాగారం మూడువందల క్వార్ట్రర్స్ లో ఉండే నజీర్ దంపతులకు మూడు రోజుల క్రితం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో మగ బిడ్డ పుట్టారు. బాబు ఆరోగ్యంగా అందంగా ఉండడంతో వారిద్దరూ మురిసి పోయారు. కానీ పూట గడవడమే కష్టంగా వుంటే పుట్టిన పెంచి పెద్ద చేయడం ఎలా అనిబాధపడుతున్నారు.
ఈలోపు నజీర్ ఆర్థిక పరిస్థితి తెల్సి ఓ ముఠా అయన తో బిడ్డ అమ్మలంటూ బేరం మొదలు పెట్టారు. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న నజీర్ కు ఈ బేరం ఆలోచనలో పడేసింది. వెంటనే వెళ్లి భార్య ను ఒప్పించాడు. రెండు లక్షలు బేరం కుదిరింది. లక్ష రూపాయలు ఆసుపత్రి ఆవరణలో ముట్టజెప్పార్ కానీ మిగిత లక్ష సర్దుబాటు ఆలస్యం కావడంతో ఆ తల్లి అమ్మతనం గుర్తొచ్చింది బోరున విలపించింది. తన బిడ్డ ను వాపస్ ఇవ్వాలంటూ విలపించింది కానీ ఎవ్వరూ స్పందించలేదు వేంటనే సమీపం లోని ఒకటో టౌన్ ఠాణా కు వెళ్ళింది.
బాధితు రాలి గోస విని అక్కడి పోలీసు లు చలించిపోయారు. కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు
