HomePOLITICAL NEWSUncategorizedఅడ్డగోలుగా గా మారిన ప్రైవేట్ పాఠశాల మీద చర్యలు తీసుకోవాలి టిఆర్ యస్ వి నేత...

అడ్డగోలుగా గా మారిన ప్రైవేట్ పాఠశాల మీద చర్యలు తీసుకోవాలి టిఆర్ యస్ వి నేత అభిలాష్ రెడ్డి డిమాండ్

ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోయింది. వ్యాపార దోరణితో యాజమాన్యాలు వ్యవహరిస్తుండడంతో సామాన్యుడికి ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతుందని బీఆర్ఎస్ వి నాయకులు ప్రొద్దుటూరి అభిలాష్ రెడ్డి ద్వజమెత్తారు.

బుదవారం జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ కు మెమొరాండం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎంతో కష్టపడి సంపాదించినదంతా పిల్లల చదువునకే ఖర్చు అవుతుండడంతో పేద, మధ్య తరగతి వారు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తున్నాడని తెలిపారు.

ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థల్లోనే చదివించాలంటేనే జంకుతున్నారు.పాఠశాలల్లో ఫీజులకు తోడు యూనిఫామ్‌లు, పుక్తకాలు, నోటుబుక్కులు, బస్సు ఫీజులు అంటూ అధిక వసూలు చేస్తున్నారనీ ఆరోపించారు.

నిజాంబాద్ జిల్లాలో 99 శాతం పాఠశాలలో అత్యధిక ఫీజులు పాఠశాలల్లోనే పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారని తెలిపారు. ముఖ్యంగా నర్సరీ నుంచి లక్షల్లో ఫీజులు రాబడుతున్న విద్యాశాఖ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు దుయ్యబట్టారు.

తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతూ నర్సరీ నుంచి పాఠ్యపుస్తకాల పేరుతో రూ. 8000 రూపాయలను తీసుకుంటున్నారనీ ఆరోపించారు.ప్రైవేటు పాఠశాలలో వ్యాపారంగా మారిన విద్యాశాఖలో ఎలాంటి చలనం లేకపోవడం సిగ్గుచేటనీ అన్నారు.

ప్రైవేట్ పాఠశాలల్లో కొన్ని అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నారు. మరికొన్ని తోక పేర్లతో తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్ని స్కూళ్లకు అనుమతులు ఉన్నాయి.

ఎన్ని స్కూల్లకు అనుమతులు లేవో డివో కార్యాలయం ఎదుట నోటీస్ బోర్డ్ పై పెట్టాలి ఎందుకు పెట్టడం లేదనీ ప్రశ్నించారు. ఎన్ని ప్రైవేటు పాఠశాలలో తనిఖీలు నిర్వహించడం లేదని ఆగ్రహించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు సుమన్, బన్నీ, రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments